"పుటము వేస్తునే ఉంటివి నన్ను" | SWARNAKARUDA | Dinesh Latest Telugu Christian Song | JK Christopher "పుటము వేస్తునే ఉంటివి నన్ను" | SWARNAKARUDA | Dinesh Latest Telugu Christian Song | JK Christopher
Posts
.మొక్కలు చూడండి ఎంత దూరముగా నాటబడినా పెరిగే కొద్దీ కలిసి పోతాయి #కానీ# మనుష్యులు మాత్రం ఒక రక్తమునుండి వచ్చినా పెరిగిన కొద్దీ దూరమై పోతారు #ఎందుకో# మానవ నైజమే అంత వయస్సురిత్యా ఎదిగేపిల్లలు కన్నవారికి, ఆర్ధికంగా ఎదిగేవారు రక్థ సంబంధాలకు, ఆత్మీయంగా ఎదిగేవారు సహజత్వానికి దూరంగా,మనిషిగా ఎదిగేవాడు మానవ త్వానికి దూరంగా,చివరికి క్రీస్తులో ఎదిగే వాడు క్రీస్తుకి(ప్రేమకి)దూరంగా ........... #ఒక్కసారి# మనం పునఃపరిశీలన చేసుకుందాం
- Get link
- X
- Other Apps
మొక్కలు చూడండి ఎంత దూరముగా నాటబడినా పెరిగే కొద్దీ కలిసి పోతాయి # కానీ # మనుష్యులు మాత్రం ఒక రక్తమునుండి వచ్చినా పెరిగిన కొద్దీ దూరమై పోతారు # ఎందుకో # మానవ నైజమే అంత వయస్సురిత్యా ఎదిగేపిల్లలు కన్నవారికి, ఆర్ధికంగా ఎదిగేవారు రక్థ సంబంధాలకు, ఆత్మీయంగా ఎదిగేవారు సహజత్వానికి దూరంగా,మనిషిగా ఎదిగేవాడు మానవ త్వానికి దూరంగా,చివరికి క్రీస్తులో ఎదిగే వాడు క్రీస్తుకి(ప్రేమకి)దూరంగా ........... # ఒక్కసారి # మనం పునఃపరిశీలన చేసుకుందాం. ప్రేమతో మీ దైవ దాసులు రాంబాబు.
చీకటికోణం(రహస్యకోణం)
- Get link
- X
- Other Apps
చీకటికోణం(రహస్యకోణం) ప్రతి మనిషి జీవితంలో కూడాను ఖచ్చితముగా ఏదో ఒకచీకటికోణం లేదా రహస్యకోణం వుండి తీరుతుంది.ఈ చీకణికోణం మొదట సంసారిక జీవితమును, తరువాత నిజ క్రైస్తవుణ్ణి అయితే దేవునితో వున్న సంబంధాన్ని ఖచ్చితంగ తెంచి వేస్తుంది.అందుకే "ప్రతి ఒక్కరు అందరిలో వున్న ప్పుడు నోరు,ఒంటరిగా వున్నప్పుడు మనస్సుని జాగ్రత్తగ వుంచుకోవాలి". బైబిల్ లో దావీదు మహారాజు సైతం(కీర్తన19:12)లో చెప్పి నట్లు"రహస్య పాపములు క్షమించమని"కోరాడు అంతగొప్ప దైవ హృదయాను సారుడైన దావీదు గారే రహస్యం జీవితాన్ని దానిలో దాగిన పాపాన్ని ఒప్పుకొని క్షమించమని ప్రార్థిస్తుంటే,మనమేంటి? చిన్నమాట మనం రోజు వాడే సెల్ ఫోను నిర్భయంగా మన రక్తసంబంధీకులకు కనీసం ఇవ్వగలమా?భయం మనకి చెందిన ఏ రహస్య కాల్స్ లేదా చాటింగ్స్ చూస్తారేమోనని.ఒంటరిగా వున్నప్పుడు ఆలోచ నా విధానం ఎలావుంటుంది? ఒంటరితనములో "యోసేపు పోతిఫర్ భార్య పట్ల,ఏకాంత వేళలో బోయజు,రూతుల పవిత్రత"మనకి మాదిరి కాదా అయ్యా-అమ్మా మన పాపములు. మనమే ఒప్పు కొనిన ఎడల మనప్రభువు నమ్మదగినవాడును,నీతిమంతుడు నై మనల్ని సమస్త దుర్నీతి నుండి విడిపించును. కేవలం పాపమేకాదు మన దేవున...
విలువైనది
- Get link
- X
- Other Apps
అడుగుడి మీకివ్వబడును ఏమి అడగాలి? మనము సంసోను గారి జీవితమును గమనిస్తే,తాను పాపము చేసినపుడు రెండు కండ్లు,బలమును,వెంట్రుకలను, భార్యను,నాజీరు వ్రతమును సహితం కోల్పోయి,అల్పునిగా మిగిలిపోయాడు అయితే దేవుని కోల్పోయిన బలమును,పగను తీర్చు కోవడానికి బలమును మాత్రము అడిగి నాడు తప్ప కోల్పోయిన ఆత్మను మాత్రం అడగలేదు.నిజంగా బలమును అడిగితే ఇచ్చిన దేవుడు కోల్పోయినఆత్మ ను అడిగితే ఇవ్వడా?ఖచ్చితంగా ఇస్తాడు. మరెందుకు అడగలేదు? అప్పటికి సంసోనుకి ఆత్మీయజీవితం కంటే పగ తీర్చుకోవడమే ప్రాముఖ్యం మయ్యింది. అలాగుననే మనంకూడా పలుసంధర్భాల్లో అడగవలసిన యుక్తమైనది అడగము.సంసోనుకి బలము, చూపు,జుత్తు,భార్య, ఆత్మీయ జీవితం కూడా అవసరమే.కాని వాటిలో యుక్తమైనది పోగొట్టు కొనిన ఆత్మీయతే.మనలో కూడా చాలామంది ఊహించని విధంగా పాపములో పడినపుడు, డబ్బు,ఆరోగ్యం,మనశ్శాంతి,సమయమే కాక ఆత్మీయతను కూడా పోగొట్టు కుంటాము.కాని మనకి కూడా దేవుడు అవకాశము గనుక ఇస్తే సంసోనులాగా అన్నింటిలో యుక్తమైన ఆత్మీయ జీవితము తప్ప మిగిలినవన్నీ ప్రాముఖ్యం గానే వుండి కోల్పోయిన వన్నీతిరిగి ఇమ్మని ప్రార్ధిస్థాం. కాని దావీదు గారైతే రాజ్యము,సింహాసనము,రక్షణానందము సహా...
Servant of God
- Get link
- X
- Other Apps
లోకమందు దీనునిగా, ఆత్మయందు ధన్యునిగా, శ్రమలతో కొట్టబడుతూ, కన్నీటితో నింపబడుతూ, వాక్యము తో సాగిపోతూ, భారముతో ఒరిగిపోతూ, కాలిపోతు కాంతినిచ్చే ప్రమిద, మండిపోతు మండించే సమిధ, ఎవరంటే, దేవుని కొరకు జీవించే సేవకుడే! అట్టి దైవ సేవకునికి హృదయ పూర్వక వందనాలు, సంపూర్ణ దైవ దీవెనలు. ప్రేమతో దైవ దాసులు:రాంబాబు.పి.
మెుదటివారిగా
- Get link
- X
- Other Apps
మొదటివాడు కయీను, తరువాతివాడు హేబేలు. హేబేలు జన్మతహః తరువాతి వాడే, కా నీ, విశ్వాస వీరుల జాబితాలో మొదటి వాడు, దేవుని కొరకు హతసాక్షిగా మొదటి వాడు, శ్రేష్ఠబలి అర్పించిన వారిలో మొదటి వాడు, క్రియనుబట్టి నీతిమంతునిగా మొదటివాడు. దేవుని మనసెరిగిన వారిలో మొదటి వాడు. అలాగే, మనము కూడా అనేకసార్లు అల్పులమని, తృణీకరించ బడిన వారమని,ఎన్నిక లేని వారమని,బలహీనులమని,సామర్ధ్యం లేని వారమని వాపోతూ వుంటాము. అయితే, మనము భౌతికంగా మనుష్యులు దృష్టిలో ఎలాగ వున్నా (హేబేలు తరువాతి వాడేను అయినా దేవుని కొలతలో మొదటి వానిగ ఎలా తన సాక్ష్యం తనని నిలబెట్టిందో) అలా దేవుని కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు, మొదటి వారిగా వాడబడుటకై ని లిచె దము గాక! అట్టి కృప ప్రభువు మీ(మన)కందరికిని దయచేయును గాక! దైవ దాసులు:పి.రాంబాబు.
క్రైస్తవ్యము
- Get link
- X
- Other Apps
ఒకేరంగు వున్నంత మాత్రాన ఇత్తడి పుత్తడి కాలేదు, ఒకే గూట్లో పెరిగినంత మాత్రాన కాకి కోకిల కాలేదు, ఒకే రంగులో వున్నంత మాత్రాన ఉల్లి మల్లె కాలేదు, ఒకే పొలములో వున్ననూ గురుగు గోధుమ కాలేదు అలాగే, ఒకే మందిరములో వుండి,వస్త్రధారణ మార్చి, రక్షణ పొందాననిచెప్తూ,వాక్యముఎరిగి, ఆత్మను పొందానని చెప్తూ,స్వభావము మారకపోతే (మనసు మారకపోతే) ఎప్పటికీ "క్రైస్తవులము" కాలేము. క్రైస్తవ్యం అంటే "క్రీస్తుని ఎరగడం కాదు క్రీస్తుని కలిగి బ్రతకడం". దైవ దాసులు........
నైతిక విలువలు
- Get link
- X
- Other Apps
ఛాతక పక్షి ఎంత దాహమయినా పైనుండి పడే వర్షపు నీటిని పైనే పట్టుకుని త్రాగుతుంది తప్ప నేలపడిన నీటిని తాకదు ఒకవేళ వర్షం రాకపోతే అలాగే వుండి చస్తుంది. అలాగే ఈమూ పక్షి కూడా ఆడమగ పక్షులు జత కట్టిన తరువాత ఏకారణం వలనైన ఆడ గాని మగపక్షి గాని చనిపోయినచో రెండవది తన జీవిత కాలం అలాగే ఒంటరిగా చచ్చేవరకు వుంటుంది తప్ప మరొక పక్షిని జత కట్టనివ్వదు నిజం. మరియు చెట్టు తనని నీరుపోసి పెంచే వాడికే కాదు, నరికే వాడికిని నీడనిస్తుంది, మరియు ఫలాల నిస్తుంది.తన తత్వమది. కాని దైవ సృష్టిలో ఒక పక్షికి,ఒక చెట్టుకి వున్న 'నైతికత''గుణం' మనిషిలో లేదు సరికదా క్రైస్తవునిలో సహా చూడలేము. (యోబు 12:7)లో చెప్పినట్లు సృష్టి సహా దైవనీతిని గూర్చి చెప్తుంది. కాబట్టి నైతిక విలువలు లేని జీవితం,జీవితం కాదు! క్రైస్తవ్యం క్రైస్తవ్యం కాదు. దైవ దాసులు......
తప్పిపోయిన పెద్ద కుమారుడు ...Telugu Christian Message Video
- Get link
- X
- Other Apps
ఎదుటి వారి అనుభవాలలోనుండి నేర్చుకో నీ అనుభవం లోనుండి జీవితమును కట్టుకో. అంతేకాని ఎదుటి వారి అనుభవాలు ఎప్పటికీ నీవి కావు ఒకవేళ అవి నీ అనుభవాలు గా చెప్పుకున్నా దొంగిలింపే. అందుకే వ్యక్తిగత అనుభవానికి మించిన పాఠం మరొకటి లేదు.నైపుణ్యత విజయం వైపు నడిపిస్తే అనుభవం ఓటమి పాలు కాకుండా నిలబెడ్తుంది. ఎప్పుడూ గెలుస్తూనే వుండాలంటే ఓడి పోకుండా వుండడం కూడా చాలా ప్రాముఖ్యం. గెలుపుకి నేర్పరితనమే గాని,ఓటమి పాలు కాకుండా వుండడానికి "అనుభవమే ముఖ్యం" ఇట్లు దైవ దాసులు:పి.రాంబాబు.
- Get link
- X
- Other Apps
ఎదుటి వారి అనుభవాలలోనుండి నేర్చుకో నీ అనుభవం లోనుండి జీవితమును కట్టుకో. అంతేకాని ఎదుటి వారి అనుభవాలు ఎప్పటికీ నీవి కావు. ఒకవేళ అవి నీ అనుభవాలు గా చెప్పుకున్నా దొంగిలింపే.అందుకే వ్యక్తిగత అనుభవానికి మించిన పాఠం మరొకటి లేదు.నైపుణ్యత విజయం వైపు నడిపిస్తే అనుభవం ఓటమి పాలు కాకుండా నిలబెడ్తుంది. ఎప్పుడూ గెలుస్తూనే వుండాలంటే ఓడి పోకుండా వుండడం కూడా చాలా ప్రాముఖ్యం. గెలుపుకి నేర్పరితనమే గాని,ఓటమి పాలు కాకుండా వుండడానికి "అనుభవమే ముఖ్యం". ఇట్లు దైవ దాసులు:పి.రాంబాబు.
పరస్పర నమ్మకంతో సాగిపొయ్యేదే కాపురమైనా,భక్తి జీవితమైనా!ఋజువులు,ఆధారాలతో సాగితే అది కాపురం అనిపించుకోదు,ఆ భక్తికి అర్ధం అసలే లేదు.(చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడని ప్రభువు చెప్పెగదా,మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన వాడు గదా)మన కుటుంబాలు నమ్మికతోసాగే ఆదర్శవంతమైన కుటుంబాలుగా వుండాలని,కోరుతూ,దీవిస్తూ...............
- Get link
- X
- Other Apps
పరస్పర నమ్మకంతో సాగిపొయ్యేదే కాపురమైనా,భక్తి జీవితమైనా!ఋజువులు,ఆధారాలతో సాగితే అది కాపురం అనిపించుకోదు,ఆ భక్తికి అర్ధం అసలే లేదు.(చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడని ప్రభువు చెప్పెగదా,మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన వాడు గదా)మన కుటుంబాలు నమ్మికతోసాగే ఆదర్శవంతమైన కుటుంబాలుగా వుండాలని,కోరుతూ,దీవిస్తూ...............
అమూల్యమైన విస్వాసం | Precious Faith | Rev.Dr.P. Rambabu | The Word Minis...
- Get link
- X
- Other Apps
అయిననూ.....(IN SPITE OF) || MOTIVATIONAL MESSAGE || REV DR P RAMBABU || ...
- Get link
- X
- Other Apps
Rambabu Pastor Testimony
- Get link
- X
- Other Apps
మా అమ్మ,నాన్న.నేను దిగ్విజయంగా దైవ సేవ చెయ్యడానికి,మా కుటుంబం అందరం దేవునిలో ఆనందించడానికి మా అమ్మ ప్రార్ధనే కారణం.మా నాన్న చాలా నైతిక విలువలున్న,వ్యక్తిత్వం వున్న వ్యక్తి.నిశబ్ధ గంభీరుడు.పోస్టల్ డిపార్టమెంట్ లో జాబ్ చేసారు.మేము చదువుకునే రోజుల్లో మేమెవరితోనైనా గొడవపడి ఇంటికొస్తే వాళ్ళది తప్పైనా మామీదే కోపపడి మమ్మల్నే గద్ధించేవాడు మా నాన్న.అటువంటి తల్లిదండ్రులను మాకిచ్చిన దేవునికి ఎల్లప్పుడూ ఋణపడి వుంటాము.దేవునికి నిండు వందనములు.(రేపు అనగా 22-04-2016)న మా అమ్మ ప్రభువు దగ్గరకు వెళ్ళి పోయిన రోజు.మాకొరకు ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకొన గలరు.ప్రార్ధనా పరురాలైన మా అమ్మ ప్రార్ధనే మాకు దీవెనకి కారణం.సంతోషం వచ్చినా,దుఃఖం వచ్చినా ప్రార్ధించడం మాత్రమే మా అమ్మకి తెలుసు.ఆమె ప్రార్ధనే, అమ్మా నాన్న ఉచితంగా ఇచ్చిన స్థలము లోనే ఇవ్వాళ సంజీవయ్య నగర్ లో ఆరాధన జరగుతుంది.అందును బట్టి ప్రభువుకి స్తోత్రం.ఆమేన్.
ప్రతి క్రైస్తవుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయమిది.అలనాడు ధూపార్తి పట్టుకున్న అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడితే తెగులు ఆగి పోయింది.(సంఖ్యా:16)(యెహేజ్కేలు22:30)లో బ్రద్ధలైన సందులో( ప్రాకారమును దిట్టపరచ)నిలబడగల యోగ్యుడు ఒక్కడైనా కలడా(దేశమును పాడుచేయకుండా నుండుటకు)అని యోచించినా ఒక్కడైనా కనబడలేదుట దేవునికి అంటే ప్రస్తుత దినాల్లో కూడా ఈ తెగులు ఆగడంలేదు అంటే మనం చేసే భక్తి మన ప్రార్థన చాలింది కాదనేగా,అందుకే ఇకనైనా నటన,మాయలు మాని కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుంటే క్షేమం, దీవెన. ఈ ప్రస్తుత పరిస్థితులను దేవుడు మార్చాల్సిందే గాని ఏవైద్యం,ఏడబ్బు,ఏ జ్ఞానం,ఏమాయ భక్తి వల్ల ఏమి కాదనేది వాస్తవం.దయచేసి అపార్ధం చేసుకోకండి. మాదగ్గరకొస్తే రిపోర్ట్స్ కూడా మార్చబడ్డాయని సాక్షాలు చెప్పించిన వారు ఏరి?స్వస్థత కొరకు మనుష్యులు మీద కాక దేవుని మీద ఆధారపడండి.భక్తులందరూ సెల్ఫ్ వదిలి సిగ్గుతో దేవుని పాదాలు ఆశ్రయించుదాం.
- Get link
- X
- Other Apps
ప్రతి క్రైస్తవుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయమిది.అలనాడు ధూపార్తి పట్టుకున్న అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడితే తెగులు ఆగి పోయింది.(సంఖ్యా:16)(యెహేజ్కేలు22:30)లో బ్రద్ధలైన సందులో( ప్రాకారమును దిట్టపరచ)నిలబడగల యోగ్యుడు ఒక్కడైనా కలడా(దేశమును పాడుచేయకుండా నుండుటకు)అని యోచించినా ఒక్కడైనా కనబడలేదుట దేవునికి అంటే ప్రస్తుత దినాల్లో కూడా ఈ తెగులు ఆగడంలేదు అంటే మనం చేసే భక్తి మన ప్రార్థన చాలింది కాదనేగా,అందుకే ఇకనైనా నటన,మాయలు మాని కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుంటే క ్షేమం, దీవెన. ఈ ప్రస్తుత పరిస్థితులను దేవుడు మార్చాల్సిందే గాని ఏవైద్యం,ఏడబ్బు,ఏ జ్ఞానం,ఏమాయ భక్తి వల్ల ఏమి కాదనేది వాస్తవం.దయచేసి అపార్ధం చేసుకోకండి. మాదగ్గరకొస్తే రిపోర్ట్స్ కూడా మార్చబడ్డాయని సాక్షాలు చెప్పించిన వారు ఏరి?స్వస్థత కొరకు మనుష్యులు మీద కాక దేవుని మీద ఆధారపడండి.భక్తులందరూ సెల్ఫ్ వదిలి సిగ్గుతో దేవుని పాదాలు ఆశ్రయించుదాం.