విలువైనది

అడుగుడి మీకివ్వబడును
ఏమి అడగాలి?
మనము సంసోను గారి జీవితమును
గమనిస్తే,తాను పాపము చేసినపుడు
రెండు కండ్లు,బలమును,వెంట్రుకలను,
భార్యను,నాజీరు వ్రతమును సహితం
కోల్పోయి,అల్పునిగా మిగిలిపోయాడు
అయితే
దేవుని కోల్పోయిన బలమును,పగను
తీర్చు కోవడానికి బలమును మాత్రము
అడిగి నాడు తప్ప కోల్పోయిన ఆత్మను
మాత్రం అడగలేదు.నిజంగా బలమును
అడిగితే ఇచ్చిన దేవుడు కోల్పోయినఆత్మ
ను అడిగితే ఇవ్వడా?ఖచ్చితంగా ఇస్తాడు.
మరెందుకు అడగలేదు?
అప్పటికి సంసోనుకి ఆత్మీయజీవితం కంటే
పగ తీర్చుకోవడమే ప్రాముఖ్యం మయ్యింది.
అలాగుననే
మనంకూడా పలుసంధర్భాల్లో అడగవలసిన
యుక్తమైనది అడగము.సంసోనుకి బలము,
చూపు,జుత్తు,భార్య, ఆత్మీయ జీవితం కూడా
అవసరమే.కాని వాటిలో యుక్తమైనది పోగొట్టు
కొనిన ఆత్మీయతే.మనలో కూడా చాలామంది
ఊహించని విధంగా పాపములో పడినపుడు,
డబ్బు,ఆరోగ్యం,మనశ్శాంతి,సమయమే కాక
ఆత్మీయతను కూడా పోగొట్టు కుంటాము.కాని
మనకి కూడా దేవుడు అవకాశము గనుక ఇస్తే
సంసోనులాగా అన్నింటిలో యుక్తమైన ఆత్మీయ
జీవితము తప్ప మిగిలినవన్నీ ప్రాముఖ్యం గానే
వుండి కోల్పోయిన వన్నీతిరిగి ఇమ్మని ప్రార్ధిస్థాం.
కాని దావీదు గారైతే
రాజ్యము,సింహాసనము,రక్షణానందము సహా
కోల్పోయినాడు. అయితే కోల్పోయిన రక్షణానం
దమును,సమ్మతిగల మనస్సునిమ్మని అడిగాడు
తప్ప రాజ్యమును గాని, సింహాసనమును గాని
మరి దేనిని మనవలే అల్పమైన వాటిని అడుగ
లేదు.అందుకే కోల్పోయిన దేదైన ఇవ్వడం దేవుని
కి సాధ్యమే అయితే దైవ దృష్టిలో యుక్తమైనది,
విలువైనది మాత్రమే అడిగి పొందుదురు గాక!
ఆమేన్!.....దైవ దాసులు రాంబాబు.పి.

Comments

Popular posts from this blog

.మొక్కలు చూడండి ఎంత దూరముగా నాటబడినా పెరిగే కొద్దీ కలిసి పోతాయి #కానీ# మనుష్యులు మాత్రం ఒక రక్తమునుండి వచ్చినా పెరిగిన కొద్దీ దూరమై పోతారు #ఎందుకో# మానవ నైజమే అంత వయస్సురిత్యా ఎదిగేపిల్లలు కన్నవారికి, ఆర్ధికంగా ఎదిగేవారు రక్థ సంబంధాలకు, ఆత్మీయంగా ఎదిగేవారు సహజత్వానికి దూరంగా,మనిషిగా ఎదిగేవాడు మానవ త్వానికి దూరంగా,చివరికి క్రీస్తులో ఎదిగే వాడు క్రీస్తుకి(ప్రేమకి)దూరంగా ........... #ఒక్కసారి# మనం పునఃపరిశీలన చేసుకుందాం

Servant of God