Posts

Showing posts from May, 2020

చీకటికోణం(రహస్యకోణం)

Image
చీకటికోణం(రహస్యకోణం) ప్రతి మనిషి జీవితంలో కూడాను ఖచ్చితముగా ఏదో ఒకచీకటికోణం లేదా రహస్యకోణం వుండి తీరుతుంది.ఈ చీకణికోణం మొదట సంసారిక జీవితమును, తరువాత నిజ క్రైస్తవుణ్ణి అయితే దేవునితో వున్న సంబంధాన్ని ఖచ్చితంగ తెంచి వేస్తుంది.అందుకే "ప్రతి ఒక్కరు  అందరిలో వున్న ప్పుడు నోరు,ఒంటరిగా వున్నప్పుడు మనస్సుని జాగ్రత్తగ వుంచుకోవాలి". బైబిల్ లో దావీదు మహారాజు సైతం(కీర్తన19:12)లో చెప్పి నట్లు"రహస్య పాపములు క్షమించమని"కోరాడు అంతగొప్ప దైవ హృదయాను సారుడైన దావీదు గారే రహస్యం జీవితాన్ని దానిలో దాగిన పాపాన్ని ఒప్పుకొని క్షమించమని ప్రార్థిస్తుంటే,మనమేంటి? చిన్నమాట మనం రోజు వాడే సెల్ ఫోను నిర్భయంగా మన రక్తసంబంధీకులకు కనీసం ఇవ్వగలమా?భయం మనకి చెందిన ఏ రహస్య కాల్స్ లేదా చాటింగ్స్ చూస్తారేమోనని.ఒంటరిగా వున్నప్పుడు ఆలోచ నా విధానం ఎలావుంటుంది? ఒంటరితనములో "యోసేపు పోతిఫర్ భార్య పట్ల,ఏకాంత వేళలో బోయజు,రూతుల పవిత్రత"మనకి మాదిరి కాదా అయ్యా-అమ్మా మన పాపములు. మనమే ఒప్పు కొనిన ఎడల మనప్రభువు నమ్మదగినవాడును,నీతిమంతుడు నై మనల్ని సమస్త దుర్నీతి నుండి విడిపించును. కేవలం పాపమేకాదు మన దేవున...

విలువైనది

Image
అడుగుడి మీకివ్వబడును ఏమి అడగాలి? మనము సంసోను గారి జీవితమును గమనిస్తే,తాను పాపము చేసినపుడు రెండు కండ్లు,బలమును,వెంట్రుకలను, భార్యను,నాజీరు వ్రతమును సహితం కోల్పోయి,అల్పునిగా మిగిలిపోయాడు అయితే దేవుని కోల్పోయిన బలమును,పగను తీర్చు కోవడానికి బలమును మాత్రము అడిగి నాడు తప్ప కోల్పోయిన ఆత్మను మాత్రం అడగలేదు.నిజంగా బలమును అడిగితే ఇచ్చిన దేవుడు కోల్పోయినఆత్మ ను అడిగితే ఇవ్వడా?ఖచ్చితంగా ఇస్తాడు. మరెందుకు అడగలేదు? అప్పటికి సంసోనుకి ఆత్మీయజీవితం కంటే పగ తీర్చుకోవడమే ప్రాముఖ్యం మయ్యింది. అలాగుననే మనంకూడా పలుసంధర్భాల్లో అడగవలసిన యుక్తమైనది అడగము.సంసోనుకి బలము, చూపు,జుత్తు,భార్య, ఆత్మీయ జీవితం కూడా అవసరమే.కాని వాటిలో యుక్తమైనది పోగొట్టు కొనిన ఆత్మీయతే.మనలో కూడా చాలామంది ఊహించని విధంగా పాపములో పడినపుడు, డబ్బు,ఆరోగ్యం,మనశ్శాంతి,సమయమే కాక ఆత్మీయతను కూడా పోగొట్టు కుంటాము.కాని మనకి కూడా దేవుడు అవకాశము గనుక ఇస్తే సంసోనులాగా అన్నింటిలో యుక్తమైన ఆత్మీయ జీవితము తప్ప మిగిలినవన్నీ ప్రాముఖ్యం గానే వుండి కోల్పోయిన వన్నీతిరిగి ఇమ్మని ప్రార్ధిస్థాం. కాని దావీదు గారైతే రాజ్యము,సింహాసనము,రక్షణానందము సహా...

Servant of God

Image
లోకమందు దీనునిగా, ఆత్మయందు ధన్యునిగా, శ్రమలతో కొట్టబడుతూ, కన్నీటితో నింపబడుతూ, వాక్యము తో సాగిపోతూ, భారముతో ఒరిగిపోతూ, కాలిపోతు కాంతినిచ్చే ప్రమిద, మండిపోతు మండించే సమిధ, ఎవరంటే, దేవుని కొరకు జీవించే సేవకుడే! అట్టి దైవ సేవకునికి హృదయ పూర్వక వందనాలు, సంపూర్ణ దైవ దీవెనలు. ప్రేమతో దైవ దాసులు:రాంబాబు.పి.

మెుదటివారిగా

Image
మొదటివాడు కయీను, తరువాతివాడు హేబేలు. హేబేలు జన్మతహః తరువాతి వాడే, కా నీ, విశ్వాస వీరుల జాబితాలో మొదటి వాడు, దేవుని కొరకు హతసాక్షిగా మొదటి వాడు, శ్రేష్ఠబలి అర్పించిన వారిలో మొదటి వాడు, క్రియనుబట్టి నీతిమంతునిగా మొదటివాడు. దేవుని మనసెరిగిన వారిలో మొదటి వాడు. అలాగే, మనము కూడా అనేకసార్లు అల్పులమని, తృణీకరించ బడిన వారమని,ఎన్నిక లేని వారమని,బలహీనులమని,సామర్ధ్యం లేని వారమని వాపోతూ వుంటాము. అయితే, మనము భౌతికంగా మనుష్యులు దృష్టిలో ఎలాగ వున్నా (హేబేలు తరువాతి వాడేను అయినా దేవుని కొలతలో మొదటి వానిగ ఎలా తన సాక్ష్యం తనని నిలబెట్టిందో) అలా దేవుని కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు, మొదటి వారిగా వాడబడుటకై ని లిచె దము  గాక! అట్టి కృప ప్రభువు మీ(మన)కందరికిని దయచేయును గాక! దైవ దాసులు:పి.రాంబాబు.

క్రైస్తవ్యము

Image
ఒకేరంగు వున్నంత మాత్రాన ఇత్తడి పుత్తడి కాలేదు,  ఒకే గూట్లో పెరిగినంత మాత్రాన కాకి కోకిల కాలేదు,  ఒకే రంగులో వున్నంత మాత్రాన ఉల్లి మల్లె కాలేదు, ఒకే పొలములో వున్ననూ గురుగు గోధుమ కాలేదు అలాగే, ఒకే మందిరములో వుండి,వస్త్రధారణ మార్చి, రక్షణ  పొందాననిచెప్తూ,వాక్యముఎరిగి,  ఆత్మను పొందానని  చెప్తూ,స్వభావము మారకపోతే  (మనసు మారకపోతే)   ఎప్పటికీ "క్రైస్తవులము" కాలేము. క్రైస్తవ్యం అంటే "క్రీస్తుని ఎరగడం కాదు క్రీస్తుని కలిగి బ్రతకడం". దైవ దాసులు........

నైతిక విలువలు

Image
ఛాతక పక్షి ఎంత దాహమయినా పైనుండి పడే వర్షపు నీటిని పైనే పట్టుకుని త్రాగుతుంది తప్ప నేలపడిన నీటిని తాకదు ఒకవేళ వర్షం రాకపోతే అలాగే వుండి చస్తుంది. అలాగే  ఈమూ పక్షి కూడా ఆడమగ పక్షులు జత కట్టిన తరువాత ఏకారణం వలనైన ఆడ గాని మగపక్షి గాని చనిపోయినచో రెండవది తన జీవిత కాలం అలాగే ఒంటరిగా చచ్చేవరకు వుంటుంది తప్ప మరొక పక్షిని జత కట్టనివ్వదు నిజం. మరియు చెట్టు తనని నీరుపోసి పెంచే వాడికే కాదు, నరికే వాడికిని నీడనిస్తుంది, మరియు ఫలాల నిస్తుంది.తన తత్వమది. కాని దైవ సృష్టిలో ఒక పక్షికి,ఒక చెట్టుకి వున్న 'నైతికత''గుణం' మనిషిలో లేదు సరికదా క్రైస్తవునిలో సహా చూడలేము. (యోబు 12:7)లో చెప్పినట్లు సృష్టి సహా దైవనీతిని గూర్చి చెప్తుంది. కాబట్టి నైతిక విలువలు లేని జీవితం,జీవితం కాదు! క్రైస్తవ్యం క్రైస్తవ్యం కాదు. దైవ దాసులు......

తప్పిపోయిన పెద్ద కుమారుడు ...Telugu Christian Message Video

Image

ఎదుటి వారి అనుభవాలలోనుండి నేర్చుకో నీ అనుభవం లోనుండి జీవితమును కట్టుకో. అంతేకాని ఎదుటి వారి అనుభవాలు ఎప్పటికీ నీవి కావు ఒకవేళ అవి నీ అనుభవాలు గా చెప్పుకున్నా దొంగిలింపే. అందుకే వ్యక్తిగత అనుభవానికి మించిన పాఠం మరొకటి లేదు.నైపుణ్యత విజయం వైపు నడిపిస్తే అనుభవం ఓటమి పాలు కాకుండా నిలబెడ్తుంది. ఎప్పుడూ గెలుస్తూనే వుండాలంటే ఓడి పోకుండా వుండడం కూడా చాలా ప్రాముఖ్యం. గెలుపుకి నేర్పరితనమే గాని,ఓటమి పాలు కాకుండా వుండడానికి "అనుభవమే ముఖ్యం" ఇట్లు దైవ దాసులు:పి.రాంబాబు.

Image
ఎదుటి వారి అనుభవాలలోనుండి నేర్చుకో నీ అనుభవం లోనుండి జీవితమును కట్టుకో. అంతేకాని  ఎదుటి వారి అనుభవాలు ఎప్పటికీ నీవి కావు. ఒకవేళ అవి నీ అనుభవాలు గా చెప్పుకున్నా దొంగిలింపే.అందుకే వ్యక్తిగత అనుభవానికి మించిన పాఠం మరొకటి లేదు.నైపుణ్యత విజయం వైపు నడిపిస్తే అనుభవం ఓటమి పాలు కాకుండా నిలబెడ్తుంది. ఎప్పుడూ గెలుస్తూనే వుండాలంటే ఓడి పోకుండా వుండడం కూడా చాలా ప్రాముఖ్యం. గెలుపుకి నేర్పరితనమే గాని,ఓటమి పాలు కాకుండా వుండడానికి "అనుభవమే ముఖ్యం". ఇట్లు దైవ దాసులు:పి.రాంబాబు.

పరస్పర నమ్మకంతో సాగిపొయ్యేదే కాపురమైనా,భక్తి జీవితమైనా!ఋజువులు,ఆధారాలతో సాగితే అది కాపురం అనిపించుకోదు,ఆ భక్తికి అర్ధం అసలే లేదు.(చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడని ప్రభువు చెప్పెగదా,మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన వాడు గదా)మన కుటుంబాలు నమ్మికతోసాగే ఆదర్శవంతమైన కుటుంబాలుగా వుండాలని,కోరుతూ,దీవిస్తూ...............

Image
పరస్పర నమ్మకంతో సాగిపొయ్యేదే కాపురమైనా,భక్తి జీవితమైనా!ఋజువులు,ఆధారాలతో సాగితే అది కాపురం అనిపించుకోదు,ఆ భక్తికి అర్ధం అసలే లేదు.(చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడని ప్రభువు చెప్పెగదా,మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన వాడు గదా)మన కుటుంబాలు నమ్మికతోసాగే ఆదర్శవంతమైన కుటుంబాలుగా వుండాలని,కోరుతూ,దీవిస్తూ...............

వాక్య విషయంలో ఎవ్వడు పండితుడు లేడు.ఎవడైనా నేను జ్ఞానిని అన్నాడంటే అది పచ్చి అబద్ధం.సముద్రమంతటిని తెచ్చిఇంట పెట్టుకోగలిగిన వాడెవడు?ఎవడైనా వాడి విశ్వాస సామర్ధ్యతను బట్టి పొందవలసినదే తప్ప సాధ్యం కాదు.

వాక్య విషయంలో ఎవ్వడు పండితుడు లేడు.ఎవడైనా నేను జ్ఞానిని అన్నాడంటే అది పచ్చి అబద్ధం.సముద్రమంతటిని తెచ్చిఇంట పెట్టుకోగలిగిన వాడెవడు?ఎవడైనా వాడి విశ్వాస సామర్ధ్యతను బట్టి పొందవలసినదే తప్ప సాధ్యం కాదు.

దున్నబడని పొలము పంటను ఇవ్వదు కాల్చబడని బంగారము మేలిమి కాలేదు త్రవ్వబడని పుడమి జలము ఇవ్వలేదు చెక్కబడని ఏ శిలా శిల్పముగ మారలేదు కొట్టబడని మనస్సు మమత పంచలేదు శ్రమలతో కొట్టబడని ఏ జీవితం క్రీస్తును పంచలేదు...... దైవ దాసులు........

Image
దున్నబడని పొలము పంటను ఇవ్వదు కాల్చబడని బంగారము మేలిమి కాలేదు త్రవ్వబడని పుడమి జలము ఇవ్వలేదు చెక్కబడని ఏ శిలా శిల్పముగ మారలేదు కొట్టబడని మనస్సు మమత పంచలేదు శ్రమలతో కొట్టబడని ఏ జీవితం క్రీస్తును పంచలేదు...... దైవ దాసులు........