స్వర్ణకారుడు తన చేతికివ్వబడిన బంగారము యొక్క స్వచ్చత చూడడానికి అది బాగా కరిగి నీరుగా మారే వరకు తీవ్రంగా కొలిమిలో కాలుస్తాడు అది నశించి పోవాలని కాదు సుమా,కాల్చబడడం వల దానిలో మలినం పోయి స్వచ్చమైన బంగారపు నీరుగా మారినపుడు ఆనీటిలో స్వర్ణకారుడు తన ముఖాన్ని చూచుకుంటాడు అప్పుడు ఆ బంగారపు నీటిలో తన ముఖం తనకి కనిపిస్తే అది "స్వచ్చ బంగారం"అని నిగ్గు తేలుస్తాడు. ఒకవేళ కలీ అయితే కాలిపోతుంది లేదా స్వర్ణకారుని ముఖాన్ని తనలో చూపించలేదు. అలాగే అమూల్యమైన బంగారుతో పోల్చబడిన మనల్ని కూడా "శ్రమల కొలిమిలో "తప్పనిసరిగా మన ఆత్మీయ స్వర్ణకారుడు పుటమువేస్తాడు అయితే మనమీద ప్రేమలేకనో,లేక మనము నశించాలనో కాదు గాని,మనలో వున్న మలినం(పాపము)పోయి శుద్ధసువర్ణముగా (పరిశుద్ధంగా)మారాలని మనలో తన రూపము చూసుకోవాలని ఆయన ఆకాంక్ష. మరి నీవు శ్రమలు వచ్చాయనీ, శోధనలో వున్నావని,వాపోతూ దైవ చిత్తాన్ని అర్ధం చేసుకోకుండా నిరాశ,నిసహలో కొట్టమిట్టాడుతూ దైవ కృపను శంకిస్తూ వున్నావేమొ "కొలిమి వెనుక, కాదు శ్రమ శోధనల వెనుక నీపట్ల దైవ చిత్రాన్ని గ్రహించి ఇప్పుడే ప్రభువుని స్తుతించు.దైవదీవెనలు నీకు కల్గును గాక! -
స్వర్ణకారుడు తన చేతికివ్వబడిన బంగారము యొక్క స్వచ్చత
చూడడానికి అది బాగా కరిగి నీరుగా మారే వరకు తీవ్రంగా
కొలిమిలో కాలుస్తాడు అది నశించి పోవాలని కాదు
సుమా,కాల్చబడడం వల దానిలో మలినం పోయి స్వచ్చమైన
బంగారపు నీరుగా మారినపుడు ఆనీటిలో స్వర్ణకారుడు తన
ముఖాన్ని చూచుకుంటాడు అప్పుడు ఆ బంగారపు నీటిలో తన
ముఖం తనకి కనిపిస్తే అది "స్వచ్చ బంగారం"అని నిగ్గు
తేలుస్తాడు. ఒకవేళ కలీ అయితే కాలిపోతుంది లేదా స్వర్ణకారుని
ముఖాన్ని తనలో చూపించలేదు. అలాగే అమూల్యమైన
బంగారుతో పోల్చబడిన మనల్ని కూడా
"శ్రమల కొలిమిలో "తప్పనిసరిగా మన ఆత్మీయ స్వర్ణకారుడు
పుటమువేస్తాడు అయితే మనమీద ప్రేమలేకనో,లేక మనము
నశించాలనో కాదు గాని,మనలో వున్న మలినం(పాపము)పోయి
శుద్ధసువర్ణముగా (పరిశుద్ధంగా)మారాలని మనలో తన రూపము
చూసుకోవాలని ఆయన ఆకాంక్ష.
మరి నీవు శ్రమలు వచ్చాయనీ, శోధనలో వున్నావని,వాపోతూ దైవ
చిత్తాన్ని అర్ధం చేసుకోకుండా నిరాశ,నిసహలో కొట్టమిట్టాడుతూ
దైవ కృపను శంకిస్తూ వున్నావేమొ "కొలిమి వెనుక, కాదు శ్రమ
శోధనల వెనుక నీపట్ల దైవ చిత్రాన్ని గ్రహించి ఇప్పుడే ప్రభువుని
స్తుతించు.దైవదీవెనలు నీకు కల్గును గాక! -

Comments
Post a Comment