"చల్లారిన పాత్రలో ఎంతవేడి పాలు పోసినా కొంతసేపటికి ఆ పాలు చల్లారిపోవల్సిందే,కాని పొయ్యిమీద కాలుతూ వున్న పాత్రలో ఎంతచల్లటి పాలు పోసినా అవి కూడా వేడెక్కవల్సిందే, అలాగే మనం కూడా దైవ సన్నిధిలో మండుతూ వుంటేనే మనలో నింపబడే వాక్యం కూడా మండుతూ అనేక హృదయాలను తాకుతుంది,అనేకుల్ని మండిస్తుంది.అంతేగాని మనం చల్లారిపోయి పొయ్యి మీదనుండి దింపబడిన పాత్ర లాగా వుంటే మనలో వున్న వాక్యం కూడా చల్లబడి పోతుంది అప్పుడు మనం కేవలం పాత్రలాగ వుంటాం తప్ప మనం మండేది వుండదు, ఇతరులను మండించేది అసలుండదు.సరికదా మనం అందించే వాక్యం కూడా ఇతరులకు తప్పుడు సందేశం అవుతుంది.అందుకే ప్రియమిత్రమా ఎప్పుడూ మండుతున్న పాత్రగా "పరిశుద్దాత్మ సన్నిధి"లో వుండడానికే ఇష్టపడదాం....... అందరికీ వందనములు.